: గుజరాత్ లో నేడు యూత్ ర్యాలీ.. పాల్గొననున్న మోడీ


2014 సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కొన్ని నెలల నుంచి పలు ర్యాలీల్లో పాల్గొంటూ, ప్రసంగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు అహ్మదాబాద్ లోని 'సర్ధార్ వల్లభాయ్ పటేల్' స్టేడియంలో గుజరాత్ బీజేపీ యూత్ వింగ్ నిర్వహించనున్న 'విజయ్ శంఖంద్' ర్యాలీలో మోడీ పాల్గొననున్నారు. గుజరాత్ యువత లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ ర్యాలీలో మోడీ ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు. దాదాపు లక్షమంది యువత ఈ ర్యాలీలో పాల్గొంటారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. పలువురు బీజేపీ నేతలు కూడా ర్యాలీలో పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News