: పార్లమెంటులో బీజేపీ అగ్రనేతల సమావేశం
పార్లమెంటులో బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో నిర్దిష్ట సవరణలపై కేంద్ర మంత్రి జైరాం రమేష్ తో చర్చించిన బీజేపీ అగ్రనాయకత్వం కేంద్ర ప్రభుత్వం స్పందనపై చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్రకు న్యాయం చేయాల్సిన కొన్ని సవరణలను బీజేపీ సూచించింది. వీటిపై ప్రభుత్వ విధానం ఎలా ఉండబోతుంది, రాజ్యసభలో అనుసరించాల్సిన విధానం ఏమిటి... వంటి అంశాలపై బీజేపీ అగ్రనాయకత్వం చర్చిస్తోంది. ఈ సమావేశంలో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు.