: డబ్బుల కోసం కూతురికి ఆరు వివాహాలు!
కూతుర్ని డబ్బులు కురిపించే వస్తువుగా భావించారు ఆ కర్కశ తల్లిదండ్రులు. 17 ఏళ్ల బాలికను ఒకరి తర్వాత ఒకరి చొప్పున ఇప్పటి వరకు ఆరుగురికి ఇచ్చి వివాహం జరిపించారు. ఎట్టకేలకు బాలిక తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ లోని హఫీజ్ బాబా నగర్ కు చెందిన అక్బర్, ఆయన రెండో భార్య తమ 17 ఏళ్ల కూతుర్ని 2012లో 30 వేల రూపాయలు తీసుకుని నాగ్ పూర్ కు చెందిన బషీర్ కు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత పుణెకు చెందిన జమాల్, ముంబైలో మరో ఇద్దరికి, 2013 ఫిబ్రవరిలో మరొకరికి ఇచ్చి వివాహం జరిపించారు. చివరిగా ఈ నెల 14న సూడాన్ కు చెందిన 50 ఏళ్ల మన్నాన్ దగ్గర లక్ష రూపాయలు తీసుకుని తమ కూతుర్ని అతడికి కట్టబెట్టారు. అతడు ఆ బాలికను ఒక లాడ్జికి తీసుకెళుతుండగా ఆమె తప్పించుకుంది. బంధువులు, పీయూసీఎల్ రాష్ట్ర అధ్యక్షురాలు వింధ్య సాయంతో రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.