: నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు... సీమాంధ్రకు న్యాయం జరగాలి: వెంకయ్యనాయుడు
తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే క్రమంలో సీమాంధ్రకు అన్యాయం చేస్తామంటే కుదరదని అన్నారు. సీమాంధ్రకు న్యాయం చేయాలని తాను కోరుతున్నానని వెంకయ్యనాయుడు తెలిపారు.