: తన కూతురు 'ఫోరెన్సిక్ సైన్స్' చదవాలని కోరుకున్న సంజయ్ దత్!


'ముంబై నగరంలో 1993లో జరిగిన పేలుళ్ల కేసులో నేను అమాయకుడిని. నాకే పాపం తెలియదు' ఇది బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వాదన. ఆయన ఇప్పటికీ ఇదే మాట చెబుతున్నారు. నాటి పేలుళ్లకు సంబంధించి ఆయుధాన్ని అక్రమంగా కలిగున్నందుకు లోగడ టాడా కోర్టు ఆయనకు 6 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

దాంతో చట్టానికి కావాల్సిందల్లా ఆధారాలే కానీ, కనిపించని వాస్తవాలు కాదని సంజయ్ కు అనిపించిందట. తనలా శిక్షలకు గురయ్యే అమాయకులకు సహాయం అందించాలని తలంచారు. అందుకే తన పెద్ద కూతురు త్రిషాలా ఫోరెన్సిక్ సైన్స్ కోర్సు చదవాలని కోరుకున్నానని సంజయ్ కొన్ని రోజుల కిందటే మీడియాకు చెప్పారు. ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా నేరానికి సంబంధించిన సాక్ష్యాలు, నిజానిజాలను తేల్చే అవకాశం ఉంటుంది. 

  • Loading...

More Telugu News