: రేపు రాహుల్ గాంధీ నేతృత్వంలో సీడబ్ల్యూసీ సమావేశం
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో ఆయన పలువురు సీనియర్ నేతలతో చర్చించనున్నారు. దీనికి ముందు ఈ రోజు పార్టీ యువనేతలతో, పలువురు ఎంపీలతో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. కాగా, రేపటి సీడబ్ల్యూసీ సమావేశానికి ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరుకావటం లేదని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్ధుల ఎంపిక, కూటమి కసరత్తు నేపథ్యంలో రేపు రాహుల్ నిర్వహించనున్న సమావేశం పాధాన్యత సంతరించుకుంది.