: అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతి


అమెరికాలో వారం క్రితం అదృశ్యమైన భారతీయ సంతతికి చెందిన 19 ఏళ్ల విద్యార్థి ఎం వరుగేష్ శవంగా ప్రత్యక్షమయ్యాడు. సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో చదువుకుంటున్న వరుగేష్ గత బుధవారం రాత్రి కనిపించకుండా పోయాడు. పోలీసులు, తల్లిదండ్రులు అతడి కోసం వెతుకుతుండగా కార్ బొనాడేల్ లోని అటవీ ప్రాంతంలో వరుగేష్ శవం లభించింది. వరుగేష్ మృతిపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. వరుగేష్ ఆచూకీ తెలిపిన వారికి 9 లక్షల రూపాయలు ఇస్తామని అతని తల్లిదండ్రులు ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే.

  • Loading...

More Telugu News