: ఢిల్లీ గవర్నర్ తో అనిల్ అంబానీ భేటీ
ఢిల్లీ రాష్ట్ర గవర్నర్ నజీబ్ జంగ్ తో అనిల్ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ భేటీ అయ్యారు. రిలయన్స్ ఇన్ ఫ్రాకు చెందిన రెండు విద్యుత్ సరఫరా సంస్థల కాగ్ ఆడిట్స్ పై చర్చించడానికి సమావేశమైనట్టు సమాచారం. ఆప్ ప్రభుత్వం రిలయన్స్ విద్యుత్ సరఫరా కంపెనీలపై కాగ్ ఆడిట్స్ నిర్వహించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ ఢిల్లీ గవర్నర్ తో సమావేశమయ్యారు.