: సోనియా గాంధీకి బుర్రలేదా?: సీఎం రమేష్


ఇన్నాళ్లూ గుర్తు లేని తెలుగు ప్రజలు సోనియా గాంధీకి ఇప్పటికిప్పుడు గుర్తుకొచ్చారా? అని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఏడు పార్టీలు తిరస్కరిస్తున్న బిల్లును లోక్ సభలో ఎలా ఆమోదిస్తారని నిలదీశారు. దీనిపై ఇప్పటికే రాజ్యసభ ఛైర్మన్ కు సవరణలు ఇచ్చామన్నారు. స్పెషల్ కేటగరీ స్టేటస్ ఇవ్వాలని అడుగుతున్న సోనియా గాంధీకి బుర్రలేదా? అని ప్రశ్నించారు.

పీఎం ఆఫీస్ ఏం చేస్తోంది? వారు దీనిని ఒప్పుకుంటారా? అయినా ప్రత్యేక ప్రతిపత్తి ఇప్పటికిప్పుడు ఎలా ఇస్తారు? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి కానీ, సోనియా గాంధీకి కానీ దమ్ముంటే స్పెషల్ ప్యాకేజీని బిల్లులో ప్రతిపాదించండి అంటూ ఆయన సవాలు విసిరారు. ఇదేదో ఆటలాడే వ్యవహారమా? అంటూ నిలదీశారు.

చిన్నపిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చినట్టు చెబితే అవుతుందా? అని మండిపడ్డారు. సోనియా గాంధీ దిష్టి బొమ్మలు దహనం చేసి, చెప్పులతో కొడుతుంటే ప్రత్యేక ప్రతిపత్తి అంటారా? అని ఆయన ఎద్దేవా చేశారు. మరి బిల్లుపై సవరణలు అంటే బిల్లు లోక్ సభకు మరోసారి రావాల్సి ఉంటుందని, అంతవరకు బిల్లు చెల్లని రూపాయితో సమానమని అన్నారు. చెల్లని రూపాయిని జేబులో పెట్టుకుంటే ఏమవుతుంది? అంటూ ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News