: 'అమ్మ' చూపు సినిమా రంగంపై పడింది!
తమిళనాడు సీఎం జయలలిత పేరిట మరో పథకం పురుడు పోసుకుంది. అమ్మ ఉనవాగం (బడ్జెట్ క్యాంటీన్), అమ్మ కుడినీర్ (చవక ధరకే మినరల్ వాటర్) బాటలో మరో పథకం చెన్నయ్ వాసులను అలరించనుంది. అయితే ఈసారి 'అమ్మ' చూపు సినిమా రంగంపై పడింది. అమ్మ థియేటర్ పేరిట చిన్న చిత్రాల కోసం బడ్జెట్ సినిమా హాళ్ళు నిర్మించనున్నారు. నేడు జరిగిన చెన్నయ్ మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నగర మేయర్ సైదై దురైసామి వెల్లడించారు. తమిళనాడు సర్కారు తాజా నిర్ణయంతో అక్కడి సినీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. చిన్న చిత్రాలు థియేటర్ల కోసం పడిగాపులు పడే బాధ తప్పుతుందని చిన్న నిర్మాతలు అంటున్నారు.