: రాజ్యసభ రేపటికి వాయిదా
రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే మంత్రి కావూరి సాంబశివరావు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికన విభజిస్తున్నారంటూ మాట్లాడేందుకు ప్రయత్నించగా, బిల్లుపై ఇంకా సభలో చర్చ చేపట్టలేదని, చర్చకు వచ్చినప్పుడు అవకాశం ఇస్తానని డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ చెప్పారు. మరోవైపు సీమాంద్ర టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, కేవీపీ ప్లకార్డులతో ఎప్పటిలానే వెల్ లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో సభ కొనసాగలేని పరిస్థితి నెలకొనడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ ప్రకటించారు.