: కిరణ్ సంతకాలు చేసిన ఫైళ్లపై సీబీఐ విచారణ చేయిస్తాం: శంకర్రావు
మాజీ సీఎం కిరణ్ పై మాజీ మంత్రి శంకర్రావు మరోసారి అక్కసు వెళ్లగక్కారు. ముఖ్యమంత్రిగా కిరణ్ చేసిన అక్రమాలను వెలుగులోకి తెస్తామని చెప్పారు. ఆయన సంతకాలు చేసిన ఫైళ్లపై సీబీఐ విచారణ జరిపిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ మ్యూజియంలో అమరవీరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.