: కిరణ్ పోతే ఏం?.. చిరంజీవి ఉన్నారు: డొక్కా
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతే తమకు నష్టమేమీ లేదని, కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి ఉన్నారని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టరనే అనుకుంటున్నానని అన్నారు. రాష్ట్రం రెండుగా చీలిపోవడానికి కిరణ్ కుమార్ రెడ్డే కారణమని డొక్కా ఆరోపించారు. కిరణ్ విభజనకు సహకరిస్తూ, సీమాంధ్ర ప్రజలను నిలువునా మోసం చేశారని డొక్కా మండిపడ్డారు.