: 'మున్నాభాయ్' జైలుకెళితే ఆ సినిమాల పరిస్థితి?


1993 నాటి ముంబై మారణ హోమానికి సంబంధించిన కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు సుప్రీంకోర్టు 5 ఏళ్ల శిక్షను ఖరారు చేయడంతో ఆయన జైలుకు వెళ్లక తప్పేలా లేదు. అదే జరిగితే ఆయననే నమ్ముకుని 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో చిత్రాలు తీస్తున్న నిర్మాతలపై పెద్ద బండే పడుతుంది. ప్రస్తుతం ఆయన నటిస్టున్న 'పోలీస్ గిరీ' 90శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. 'సొహామ్ షాహ్ షేర్' కూడా 90శాతం పూర్తయింది.

ఇక రాజ్ కుమార్ హిరానీస్ 'పీకే' సగమే పూర్తవగా, రెన్సిల్ డి సిల్వ 'అగ్లీ' సినిమా 30 శాతం షూటింగ్ ముగిసింది. ఇవి కాక సంజయ్ దత్ తో 'మున్నాభాయ్ చలే ఢిల్లీ' అనే సినిమా నిర్మిస్తున్నట్లు ఇటీవలే ప్రకటన వెలువడింది. అలాగే, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న జంజీర్' సినిమా కూడా  అంతో ఇంతో ఇబ్బందికి గురవుతుంది. ఇప్పుడు సంజయ్ జైలుకెళితే వీటి పరిస్థితి ఏమిటి? 

  • Loading...

More Telugu News