: సభలో నిలబడి నిశ్శబ్దంగా చిరంజీవి నిరసన.. స్థాణువై నిలుచున్న కేవీపీ
రాజ్యసభలో ఇవాళ తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన విషయం విదితమే. ప్రస్తుతం స్ట్రీట్ వెండర్స్ బిల్లుపై చర్చ జరుగుతోంది. మరోపక్క, సభలో సీమాంధ్ర మంత్రులు, ఎంపీల నిరసన కొనసాగుతోంది. రాజ్యసభ వెల్ లో కేవీపీ రామచంద్రరావు స్థాణువై నిలబడి ‘వియ్ వాంట్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్’ ప్లకార్డు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు.
కేంద్ర మంత్రి చిరంజీవి అయితే.. నిశ్శబ్దంగా నిలబడి తన నిరసనను సభకు తెలుపుతున్నారు. ఇక, కేవీపీతో పాటు వెల్ లోనే సుజనాచౌదరి, సీఎం రమేష్ తదితరులున్నారు. సీఎం రమేష్ ‘తెలుగుదేశం పార్టీ -సేవ్ ఆంధ్రప్రదేశ్’ ప్లకార్డు ప్రదర్శిస్తున్నారు.