: కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కలసిపోతే బాగుంటుంది: గీతారెడ్డి


టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కూడా తెలంగాణ కోసం పోరాడాయని మంత్రి గీతారెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో సోనియాగాంధీకి కృతజ్ఞత తెలపడానికి కేసీఆర్ ఒక భారీ సభ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోందని... అదే నిజమైతే వారు తమతో కలసిపోతే ఇంకా బాగుంటుందని అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో తన తల్లి ఈశ్వరీబాయి కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News