: రాజ్యసభలో తీవ్ర గందరగోళం.. 4 గంటల వరకు వాయిదా


మూడు గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో తీవ్ర గందరగోళం ఏర్పడటంతో మళ్లీ వాయిదా పడింది. సభ మొదలైన వెంటనే అధికార, విపక్ష సభ్యుల మధ్య పలు బిల్లులపై చర్చ విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ సభ్యులను వారించారు. ఈ క్రమంలో సీపీఐ నేత సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. వీధుల వెంట తిరిగి అమ్మేవారి సంక్షేమ బిల్లుపై చర్చించాలని కోరారు. అటు వెంటనే తమిళ జాలర్ల అంశంపై సమాధానం చెప్పాల్సి ఉందని, అగస్టా హెలికాప్టర్ల అంశంపై తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందని బీజేపీ సభ్యుడు రవిశంకర్ ప్రసాద్ అడిగారు. ఇందుకు సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా, అగస్టా హెలికాప్టర్ల అంశంపై సమాధానం చెబుతామన్నారు.

ఇదిలావుంటే అన్నాడీఎంకే సభ్యుడు మైత్రేయన్ మాట్లాడుతూ, శ్రీలంక నావికాదళం దాడుల నుంచి తమిళ జాలర్లను రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జాలర్ల రక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అందుకు నిరసనగా ఛైర్మన్ వెల్ లోకి వెళ్లి మైత్రేయన్ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను నాలుగు గంటలకు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News