: మేమిచ్చిన నోటీసుపై చర్చ జరగాలి: సీపీఐ రాజా
సభ నిర్వహణలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం ఏర్పడి చర్చ జరగకపోవడంతో సీపీఐ ఎంపీ డి.రాజా కలుగజేసుకున్నారు. సభను సజావుగా నడిపించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల ఆందోళన సమయంలో సీపీఐకు చెందిన ఓ ఎంపీపై లాఠీఛార్జి చేశారని, ఈ ఘటనను ఖండిస్తూ ఇచ్చిన హక్కుల నోటీసుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సభలో మిగతా సభ్యులు తామిచ్చిన నోటీసులపై చర్చ జరపాలంటూ కోరుతున్నారు.