: కెరీర్ బెస్ట్ ర్యాంకు సాధించిన కోహ్లీ


టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఐసీసీ నేడు విడుదల చేసిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో కోహ్లీ టాప్ టెన్ కు ఎగబాకాడు. గత జాబితాలో 11వ స్థానంలో నిలిచిన ఈ ఢిల్లీ యువకెరటం రెండు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. కివీస్ తో రెండో టెస్టులో సెంచరీ నమోదు చేయడం కోహ్లీకి లాభించింది. మరో యువ సంచలనం చటేశ్వర్ పుజారా ఓ స్థానం దిగజారి ఏడో స్థానంలో నిలిచాడు. టాప్ టెన్ లో ఉన్న భారత బ్యాట్స్ మెన్ వీరిద్దరే. ఇక ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ర్యాంకుల్లో రెండు స్థానాలు పతనమై పదోస్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండు టెస్టుల్లోనూ అశ్విన్ రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. అయితే, ఆల్ రౌండర్ల జాబితాలో మాత్రం అశ్విన్ నెంబర్ వన్ కు ఢోకాలేదు. బౌలింగ్ విభాగంలో హైదరాబాదీ స్పిన్నర్ ఓజా 12వ స్థానంలో నిలిచాడు.

  • Loading...

More Telugu News