: కాంగ్రెస్, బీజేపీ బిల్లు ఆమోదం కోసం కుమ్మక్కయ్యారు: సీపీఎం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ఆమోదించిన తీరు అప్రజాస్వామికమని సీపీఎం అభిప్రాయపడింది. ఢిల్లీలో ఆ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించే క్రమంలో పార్లమెంట్ నియమనిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు. ఎప్పుడూ ఎడమోహం పెడమోహంగా ఉండే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు బిల్లు ఆమోదం కోసం కుమ్మక్కయ్యాయని విమర్శించింది.

అధికార కాంగ్రెస్సే కాకుండా, బీజేపీ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని సీపీఎం స్పష్టం చేసింది. బిల్లుపై చర్చకు బీజేపీ పట్టుబట్టకపోవడం దురదృష్టం అని అన్నారు. ప్రభుత్వం అన్ని రకాల అప్రజాస్వామిక చర్యలకు పాల్పడి బిల్లును ఆమోదించిందని వారు మండిపడ్డారు. ప్రభుత్వమే కావాలని ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసిందని వారు విమర్శించారు.

  • Loading...

More Telugu News