: మమతా బెనర్జీకి అన్నా హాజరే మద్దతు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సామాజిక కార్యకర్త అన్నా హజారే అంశాల వారీగా మద్దతు ప్రకటించారు. నిన్న రాత్రి తృణమూల్ కార్యాలయానికి వెళ్లి మమతతో అన్నా విస్తృత సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో త్వరలో వారిద్దరి ఆధ్వర్యంలో 'ఫైట్ ఫర్ ఇండియా' ప్రచార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో మాట్లాడిన అన్నా, మమత ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న నాయకురాలని ప్రశంసించారు. ఆమె దేశానికి, సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారన్నారు. మమత సిద్ధాంతాలను మాత్రమే తాను సమర్థిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆమె నిరాడంబర జీవితం గడుపుతున్నారని అన్నారు.