: మరో రసవత్తర పోరుకు భారత్, పాకిస్థాన్ రెడీ
ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్థాన్, ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ లంటే ఆ మజాయే వేరు. వేదిక ఎక్కడైనా గ్యాలరీలు నిండిపోవాల్సిందే. ఎన్నాళ్ళ నుంచో ఆనవాయతీగా వస్తున్న ఈ స్పర్థకు కొనసాగింపుగా భారత్, పాక్ జట్లు మరోమారు అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల బంగ్లాదేశ్ వేదికగా జరగనున్న ఆసియా కప్ లో దాయాదుల సమరం జరగనుంది. మార్చి 2న జరిగే ఈ మ్యాచ్ కు మిర్పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 25న పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ తో ఆరంభయ్యే ఈ టోర్నీ షెడ్యూల్ ను నేడు విడుదల చేశారు. భారత్ తన తొలి మ్యాచ్ ను ఈ నెల 28 న శ్రీలంకతో ఫతుల్లాలో ఆడనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తో పాటు పసికూన ఆఫ్ఘనిస్తాన్ కూడా పాల్గొంటోంది.