: కాశ్మీర్ అసెంబ్లీలో హైడ్రామా..అధికారిని చెంపదెబ్బలు కొట్టిన ఎమ్మెల్యే


జమ్మూకాశ్మీర్ రాష్ట్ర శాసనసభలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార పక్షం ప్రతిపాదనలకు అడ్డుచెప్పేందుకు వస్తున్న ప్రతిపక్ష పీడీపీ సభ్యుడు సయ్యద్ బషీర్ అహ్మద్ సిబ్బందిపై చేయిచేసుకున్నారు. స్పీకర్ ఆదేశాల మేరకు సభ్యులను భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్తుండగా పీడీపీ నేత బషీర్ అహ్మద్ వెల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయనను అడ్డుకునేందుకు భద్రతాధికారి ప్రయత్నించారు. దీంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో బషీర్ అహ్మద్ ఆ అధికారి చెంప మూడుసార్లు ఛెళ్లుమనిపించారు.

  • Loading...

More Telugu News