: ఆ సభ పరువు పోయింది.. కనీసం ఈ సభ పరువైనా కాపాడండి: వెంకయ్యనాయుడు
రాజ్యసభలో చర్చ వాడివేడిగా కొనసాగుతోంది. బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తనదైన శైలిలో సభలో చెలరేగిపోయారు. తెలంగాణ బిల్లు విషయంలో లోక్ సభలో జరిగిన పరిణామాలు సిగ్గుతో తలవంచుకునేలా ఉన్నాయని... ఆ సభ పరువు పోయిందని ఆయన అన్నారు. కనీసం ఈ సభనైనా సజావుగా నడిపి రాజ్యసభ పరువును కాపాడాల్సిందిగా డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ను ఆయన కోరారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, సీమాంధ్రుల సమస్యలను ఏ విధంగా తీర్చాలనుకుంటున్నారో వివరంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు.