: సభను నడపాల్సిన విధానం ఇది కాదు: వెంకయ్యనాయుడు
బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు నిరసన తెలుపుతుండగా సభను ఎలా కొనసాగిస్తారని, బిల్లును ఎలా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు. సభ నిర్వహణ చేతకానప్పుడు సభను ఎలా నిర్వహిస్తున్నారని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ కురియన్ తో తీవ్ర వాగ్వాదానికి దిగారు.