: హెచ్1బి వీసాల పంట.. గ్రీన్ కార్డ్ పౌరసత్వం


అమెరికా కలలు కనే భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులకు శుభవార్త. వీరికి అనుకూలించే పలు నిబంధనలను అమెరికా సేనేటర్లు అక్కడి కాంగ్రెస్ కు ప్రతిపాదించారు. ఇవి ఆమోదం పొందితే విదేశీ విద్యార్థులకు ముందుగా జారీ చేయాలనుకున్న హెచ్1బి వీసాలు రెట్టింపు అవుతాయి. అంటే 65వేల వీసాలు కాస్తా 1,30,000కు పెరుగుతాయి. అలాగే, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ తదితర కోర్సులను అమెరికాలో చదివిన వారు అక్కడే ఉండాలనుకుంటే వారికి గ్రీన్ కార్డ్ హోల్డర్ పౌరసత్వం లభిస్తుంది. 

అమెరికా యూనివర్సిటీలో ఏటా లక్ష మంది వరకూ ప్రవేశాలు పొందుతున్నారు. సెనేటర్ల నూతన ప్రతిపాదనలు కచ్చితంగా మనవారికి ప్రయోజనం కల్పించేవే. వృత్తి నిపుణుల కొరతను తీర్చేందుకే ఈ కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఇవి ఆమోదం పొందితే ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎమ్ సంస్థలకు నిపుణుల కొరత తీరుతుంది. 

అమెరికాలోని విశ్వవిద్యాలయాలు సైన్స్, ఇంజనీరింగ్ డిగ్రీలలో సరిపడా నిపుణులను తయారు చేయలేకపోతున్నాయని అక్కడి టెక్నాలజీ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ మార్కెట్ లో అమెరికా కంపెనీలు పోటీని కొనసాగించాలంటే అధిక నైపుణ్యం కలిగిన పనివారిని భర్తీ చేసుకోవాల్సి ఉందని, స్థానికంగా ఉన్నత విద్యను అభ్యసించే విదేశీ విద్యార్థులు తిరిగి వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఉందంటూ ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్, యాహూకు చందిన మరిస్సా మేయర్ ఇలా ఉన్నతస్థాయి కంపెనీల సీఈఓలు గతవారం అధ్యక్షుడు ఒబామాకు లేఖ రాశారు. దీంతో కొత్త ప్రతిపాదనలు రూపొందాయి. 

  • Loading...

More Telugu News