: బిల్లు సవరణలపై రాజ్యసభ ఛైర్మన్ కు ‘శీలం’ నోటీసులు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యసభకు చేరిన నేపథ్యంలో బిల్లుపై సవరణలకు కేంద్ర సహాయ మంత్రి జేడీ శీలం రాజ్యసభ ఛైర్మన్ కు నోటీసులు ఇచ్చారు. సీమాంద్రలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు కేటాయించే నిధులపై స్పష్టత ఇవ్వాలని, వీటితో పాటు రాయలసీమలోని కొన్ని జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఛైర్మన్ కు ఇచ్చిన నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రవిభజన వల్ల సీమాంధ్ర ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందని, సీమాంధ్ర ప్రాంతంలో పన్ను రాయితీలపై స్పష్టత ఇవ్వాలని జేడీ శీలం ఈ నోటీసులో కోరారు. ఆ పన్ను రాయితీలన్నిటికీ వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో కేటాయింపులు జరగాలని ఆయన సూచించారు. అయితే టీ-బిల్లుపై 10 సవరణలు చేయాలని రాజ్యసభలో బీజేపీ కోరింది. సీమాంధ్ర ప్రాంతానికి 10 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ కోరాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించింది.

  • Loading...

More Telugu News