: అరగంట పాటు శాసనసభ వాయిదా
రాష్ట్ర శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. సభ్యుల తీరుతో సభ మళ్లీ అర్ధగంట పాటు వాయిదాపడింది. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని టీఆర్ఎస్, టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అందుకు సభాపతి అనుమతించకపోవడంతో స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేశారు. ఈ వైఖరితో సమావేశాలు పూర్తిగా స్థంభించాయి. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను వాయిదా వేశారు. ఉదయం మొదలైన శాసనసభలో విపక్ష సభ్యులు సమర్పించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.