: తెలంగాణ బిల్లును ఆమోదించిన కేంద్రానికి మహిళా బిల్లు కనబడలేదా?: జయప్రద
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీతో సంబంధం లేకుండా ఆమోదించిన కేంద్ర ప్రభుత్వానికి మహిళా బిల్లు కనబడడం లేదా? అని ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? అని ఆమె ప్రశ్నించారు. భారతీయ మహిళలకు సంబంధించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇంతలా నీరుగారుస్తారా? అని నిలదీశారు. 15వ లోక్ సభ పదవీకాలం ముగుస్తున్నా మహళా బిల్లు ఊసెత్తకపోవడం బాధేస్తోందని అన్నారు. మహిళా బిల్లు పట్ల ప్రభుత్వం తీరు మహిళలను ఆవేదనకు గురి చేస్తోందని జయప్రద తెలిపారు.