: చివరకు డకౌట్ అయిన సీఎం కిరణ్: జోగి రమేష్
సీఎం కిరణ్ పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బాల్స్ అన్నీ ఆడి.. డకౌట్ అయిన కిరణ్ ఇప్పుడు ఎవరిని ఉద్ధరించడానికి రాజీనామా చేశారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రపన్ని మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును ఆమోదించి తెలుగు రాష్ట్రాన్ని చీల్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్-బీజేపీలతో కలసి చంద్రబాబు విభజన బిల్లుకు సహకరించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రజలను మోసం చేశారన్నారు. బాబును నమ్ముకోవద్దని.. టీడీపీ నేతలకు జోగి రమేష్ హితవు పలికారు. ఇవాళ వైఎస్సార్సీపీ బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఆయన విజయవాడలో జరిగిన సీమాంధ్ర బంద్ లో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన చేసిన కేంద్ర ప్రభుత్వంతో పాటు అందుకు సహకరించిన కిరణ్, విపక్ష నేతలపై జోగి రమేష్ మండిపడ్డారు.