: టీ బిల్లు ఆమోదం పొందిన తీరుపై రాష్ట్రపతికి తృణమూల్ ఫిర్యాదు
పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరును తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు దానిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తృణమూల్ ఫిర్యాదు చేసింది. బిల్లు అంశంలో కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఆ పార్టీ విమర్శించింది. తమ వినతిపై సరైన చర్య తీసుకుంటామని రాష్ట్రపతి చెప్పినట్లు తృణమూల్ తెలిపింది. సవరణలపై ఓటింగును తమతో పాటు ఎంఐఎం మాత్రమే కోరిందని పేర్కొంది. అయితే, అందరూ నిలబడి ఉన్నప్పుడు తలల లెక్కింపు వల్ల అనుకూలం, వ్యతిరేకమని ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించింది.