: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన?
ముఖ్యమంత్రి పదవికి కిరణ్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి స్థానంలో కొత్త వారిని నియమించాలా? లేక రాష్టపతి పాలన విధించాలా? అనే విషయంలో తర్జనభర్జన పడుతోంది. ఈ మధ్యాహ్నం లేదా సాయంత్రంలోగా ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. సభలో సభ్యుల బలం చూసుకుని అధిష్ఠానం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.