: తొలివికెట్ కోల్పోయిన ఆసిస్
నాలుగు టెస్టు సిరీస్ లలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా ప్రారంభమైన చివరి టెస్టులో ఆసిస్ 4 పరుగుల వద్ద మొదటి వికెట్ ను కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగులో ఓపెనర్ వార్నర్ డకౌటయ్యాడు. అంతకుముందు టాస్ గెలిచిన ఆసిస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఈ మ్యాచుకు దూరంగా ఉన్నాడు. షేన్ వాట్సన్ బాధ్యతలను తీసుకున్నాడు