: సీఎం పదవికి, కాంగ్రెస్ పార్టీకి కిరణ్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగానే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే పోరాటం చేశానని తెలిపారు. రాజకీయ పదవులు, భవిష్యత్తు తనకు ముఖ్యం కాదని స్పష్టం చేశారు.