: అధికారం కోసం తెలుగు జాతికి తీవ్ర నష్టం కలిగించారు: సీఎం


బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైకాపా, టీఆర్ఎస్ లు అధికారం కోసం తెలుగు జాతికి తీవ్ర నష్టం కలిగించాయని సీఎం కిరణ్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. విభజనతో ఇరు ప్రాంతాలకు నష్టం జరుగుతుందని చెప్పారు. కలసి ఉన్నప్పుడు అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పారు. విభజనతో ఇరు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెట్టే అంశాలు (నీరు, విద్య, రెవెన్యూ,...) చాలా ఉన్నాయని తెలిపారు. ప్రజలు నష్టపోయే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. తనతో పాటు తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

రాష్ట్ర విభజన వ్యవహారంలో మొదటి నుంచి అన్ని రకాలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపించిన సీఎం, ఒక రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఎన్నో అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జీవోఎం ఏర్పాటు, జీవోఎం వ్యవహారశైలి కూడా సరైన విధంగా లేదని విమర్శించారు. వారు పార్లమెంటులో పెట్టిన బిల్లులో తాము వ్యతిరేకించిన అంశాలన్నింటినీ పొందుపరిచారన్నారు. కేబినెట్ నోట్ ను చదువుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. ఒక డ్రాఫ్ట్ బిల్లును అసెంబ్లీలో చర్చించడం ఎంత ముఖ్యమో రాజ్యాంగ నిపుణులు కూడా తెలుసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News