: నాకో బ్రహ్మచారి కావాలి: బిపాషా


తనకు అర్హత కలిగిన బ్రహ్మచారి కావాలని బిపాషా కోరుకుంటోంది. ఫ్లోరిడాలో ఏప్రిల్లో జరగనున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ అవార్డ్స్(ఐఐఎఫ్ఏ) కార్యక్రమం సందర్భంగా బాలీవుడ్ తారలు పలువురు ప్రదర్శన ఇవ్వనున్నారు. వారిలో బిపాషాబసు కూడా ఉంది. బిపాషా నటుడు హర్మాన్ బవేజాతో డేటింగ్ చేస్తోందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్మాన్ తో కలిసి ఐఐఎఫ్ఏ అవార్డుల కార్యక్రమానికి వెళుతున్నారా? అని విలేకరులు అడగ్గా.. 'నేను ఒంటరిగానే వెళుతున్నాను. బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తున్నాను' అంటూ బదులిచ్చింది.

  • Loading...

More Telugu News