: టీబిల్లును ఆమోదించవద్దని రాష్ట్రపతిని కోరతా: మమతా బెనర్జీ
లోక్ సభలో టీబిల్లును ఆమోదించే క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యున్నత చట్ట సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు తృణమూల్ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని కుండ బద్దలు కొట్టారు. తాను రాష్ట్రపతిని కలుస్తున్నానని... టీబిల్లును ఆమోదించరాదని ఆయనను కోరతానని స్పష్టం చేశారు. దేశంలోని ఇతర పార్టీలు కూడా విభజనను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.