: సుష్మాస్వరాజ్ సీమాంధ్రలో అడుగుపెట్టగలరా?: సీఎం రమేష్
ముగ్గురు మహిళలు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. నిన్న లోక్ సభలో జరిగిన అమానుషాన్ని ప్రపంచం మొత్తం గమనించిందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు దేశ పరువును గంగలో కలిపారని విమర్శించారు. మోడీపై కూడా రమేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోనియా, రాహుల్ సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లగలరా? అని ఓ బహిరంగ సభలో మోడీ ప్రశ్నించారని... ఇంత జరిగిన తర్వాత సుష్మాస్వరాజ్ సీమాంధ్రలో అడుగుపెట్టగలరా? అంటూ మోడీని నిలదీశారు.