: సీమాంధ్ర వ్యాప్తంగా బంద్.. ఎగసిపడుతున్న నిరసనలు, ఆగ్రహ జ్వాలలు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంపై నిరసనగా సీమాంధ్ర జిల్లాల్లో ప్రజలు బంద్ పాటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీమాంధ్రలోని వివిధ రాజకీయ పార్టీలు, ఏపీఎన్జీవోలు ఇచ్చిన పిలుపుతో 13 జిల్లాల్లో బంద్ జరుగుతోంది. దాంతో, ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. విద్యా సంస్థలు మూతపడ్డాయి. మరోవైపు వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు తెలుపుతున్నారు. కొన్నిచోట్ల నిరసనలు, ఆగ్రహ జ్వాలలు తీవ్రంగా ఎగసిపడుతున్నాయి. మరోవైపు టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీలు చేస్తున్నారు. కొంతమంది సమైక్యవాదులు రోడ్లపై ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.