: ప్రసారాలు ఆపడం, పెప్పర్ స్ప్రే చేయడం రెండూ ఒకటే: బీజేపీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతున్నప్పుడు లోక్ సభ టీవీ ప్రసారాలను నిలిపివేయడం కూడా పెప్పర్ స్ప్రే ఘటనతో సమానమైనదేనని బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తప్పు చేస్తున్నామన్న స్పృహతోనే కాంగ్రెస్ పార్టీ అలా ప్రవర్తించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానం తప్పని ఆ పార్టీకి కూడా తెలుసని ఆయన తెలిపారు.