: బుధవారం నాడు సీమాంధ్రలోని అన్ని యూనివర్శిటీలు బంద్.. పరీక్షలు వాయిదా
లోక్ సభలో తెలంగాణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందటంపై సీమాంధ్ర వాసులు మండిపడుతున్నారు. బుధవారం నాడు సీమాంధ్ర ప్రాంతంలోని అన్ని యూనివర్శిటీలు బంద్ పాటించాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది.
రాయలసీమ యూనివర్శిటీలో ఈ నెల 19, 20న జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వర్శిటీ అధికారులు తెలిపారు. కాకినాడలోని జేఎన్టీయూ పరిధిలో బుధవారం నాడు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు.