: తెలంగాణ కోసం పోరాడిన వారు గవర్నర్ పాలన ఎలా అంగీకరించారు?: అసదుద్దీన్ ఒవైసీ


తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినవారు హైదరాబాద్ లో గవర్నర్ పాలనను ఎందుకు అంగీకరించారు? అని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ తాము గవర్నర్ కు అధికారాలు కల్పించడాన్ని రాజ్యసభలో ప్రశ్నిస్తామన్నారు. అలాగే ఈ క్లాజులపై సుప్రీంకోర్టులో పోరాడతామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధాని అనే అంశం రాజ్యాంగ సవరణ లేకుండా ఆమోదం పొందదని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు దీనిని కొట్టి వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News