: ప్రజాస్వామ్యం ఓడిపోయింది.. బిల్లు పాసైంది: తృణమూల్ ఎంపీ దినేష్ త్రివేది
లోక్ సభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేయడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ దినేష్ త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని ఆయన తెలిపారు. కానీ కెమెరాలు ఆపివేసి, ప్రసారాలను బ్రేక్ చేశారని ఆయన మండిపడ్డారు. ఇది అసలు నాగరిక సమాజ లక్షణమా? అని ఆయన ప్రశ్నించారు.
సభలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. పార్లమెంటులో తమకు పనేం ఉంటుందని, అందుకే తాము వాకౌట్ చేసి వచ్చామని దినేష్ త్రివేది చెప్పారు. ఇవాళ తాము చాలా బాధపడుతున్నామని ఆయన అన్నారు. 'ఈరోజు ప్రజాస్వామ్యం ఓడిపోయింది.. బిల్లు పాసైంది' అని ఆయన వ్యాఖ్యానించారు.