: సీమాంధ్రలో ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో సీమాంధ్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బిల్లును ఏకపక్షంగా ఆమోదించారని ఆరోపిస్తూ సీమాంధ్ర మొత్తం ఆందోళనలు వెల్లువెత్తాయి. సీమాంధ్రులు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చి స్వచ్ఛందంగా నిరసనలు తెలుపుతున్నారు. కేంద్ర మంత్రులు, సీమాంధ్ర ఎంపీలు, రాజకీయ నాయకుల చేతకానితనం వల్లే రాష్ట్రం రెండు ముక్కలైపోయిందని ఆరోపిస్తున్నారు. సీమాంధ్ర వ్యాప్తంగా భద్రతాదళాలను భారీ ఎత్తున మోహరించారు. ఎక్కడికక్కడ పోలీసులు కవాతు చేస్తున్నారు.