: ఓటింగ్ ద్వారానే బిల్లు ఆమోదం పొందింది: జైపాల్ రెడ్డి
9 రోజుల నుంచి పార్లమెంటు సమావేశాలు స్తంభించాయని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చెప్పారు. లోక్ సభ జరిగే సమయంలో సభ్యులు ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు. కానీ ముసాయిదా బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని.. కానీ అలా జరగలేదని ఆయన చెప్పారు. సభలో ఆందోళనలు జరుగుతుంటే ఓటింగ్ జరగడం అసాధ్యమని ఆయన చెప్పారు.
తెలంగాణ ముసాయిదా బిల్లు ఓటింగ్ ద్వారానే ఆమోదం పొందిందని జైపాల్ రెడ్డి అన్నారు. ఇది మూజువాణి ఓటు కానే కాదని ఆయన స్పష్టం చేశారు. మొన్న సభలో జరిగిన పెప్పర్ స్ప్రే ఘటనతో సభ ప్రతిష్ఠ దిగజారిందని అయన అన్నారు. బిల్లు ఆమోదం సమయంలో లోక్ సభ ప్రత్యక్ష ప్రసారాలను ఎందుకు ఆపారో స్పీకర్ తర్వాత వివరిస్తారని ఆయన చెప్పారు.