: అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనే.. కేంద్ర మంత్రులు ఏం చేశారు?: బాబు


రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లు లోక్ సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. పార్లమెంటు ఆవరణలో ఓ మీడియా ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ, అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందన్నారు. తాము మొదటి నుంచి సమన్యాయం కావాలని చెబుతూ వచ్చామని, విభజన హేతుబద్ధంగా ఉండాలని సూచించామని తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అన్నింటిని తుంగలో తొక్కి నిరంకుశంగా వ్యవహరించిందని మండిపడ్డారు. రెండు ప్రాంతాలను సమంగానే చూశామని, రెండు కళ్ళలా భావించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆలోచిస్తే, తాము ప్రజల పక్షాన ఆలోచించామని స్పష్టం చేశారు. ఇక, విభజన ఆపుతామని బీరాలు పలికిన కేంద్ర మంత్రులు ఏం చేశారని బాబు ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News