: ఏపీలో 'అణు' మెటీరియల్
అణు శక్తికి మూల ఇంధనమైన యురేనియం ధాతు నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్ లోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నట్టు కనుగొన్నారు. అరుదుగా లభించే యురేనియం ధాతువు అయిన అయాంథనైట్ అనే ఖనిజం భారత్ లో వెలుగు చూడడం ఇదే ప్రథమం. గత 90 ఏళ్ళుగా ఈ ధాతువు వినియోగంలో ఉంది. అచ్చంపేట్ మండలం అక్కవరం గ్రామం వద్ద ఈ నిక్షేపాలను కనుగొన్నారు. హైదరాబాద్ లో ఉన్న అటమిక్ మినరల్స్ డైరక్టరేట్ ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఖనిజం ప్రపంచంలో 8 దేశాల్లోనే లభ్యమవుతోంది.