: కేజ్రివాల్ పై గడ్కరీ పరువునష్టం కేసు
సీఎం పదవికి రాజీనామా చేసిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ పై బీజేపీ నేత నితిన్ గడ్కరీ పరువునష్టం కేసు దాఖలు చేశారు. తనను అవినీతి పరుడు అని పేర్కొని తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా కేజ్రివాల్ వ్యవహరించారని గడ్కరీ నేడు ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టులో ఫిర్యాదు చేశారు. జనవరి 31న కేజ్రివాల్ అవినీతి పరులంటూ కొందరి జాబితాను విడుదల చేశారు. దాంట్లో గడ్కరీ పేరు కూడా ఉంది. తానెలాంటి తప్పుడు పనులు చేయకపోయినా, తనపై అవినీతి ముద్ర వేశారని, అందుకే కేజ్రివాల్ పై తగిన చర్యలు తీసుకోవాలని గడ్కరీ కోర్టును కోరారు.