: రాజకీయ చదరంగంలో ఓడిపోయాము..రాజకీయ పార్టీలకు బుద్ధి చెబుదాం: అశోక్ బాబు
రాష్ట్ర విభజన బిల్లును లోక్ సభ ఆమోదించడం దురదృష్టం అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ బలహీన నాయకులను ఎన్నుకోవడం ప్రజలదే తప్పని అన్నారు. ఎంపీలు ఆ రోజే రాజీనామా చేసి ఉంటే విభజన ఆగి ఉండేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే రోజు దగ్గర్లోనే ఉందని ఆయన తెలిపారు. ప్రజలు నిరాశకులోను కాకుండా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ చదరంగంలో సీమాంధ్ర నేతలు ఓడిపోయారని అన్నారు. ఇకపై కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.