: కొత్త రాష్ట్రం అమర వీరులకే అంకితం: దత్తాత్రేయ
తెలంగాణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన ఈ రోజు శుభదినమని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. కొన్నేళ్లుగా తెలంగాణ ప్రజలు సాగిస్తున్న పోరాటం ఫలించిన రోజుగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అమరవీరులకు అంకితమిస్తున్నట్లు దత్తన్న చెప్పారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.